పురాణములు
శ్రీ వేదవ్యాసుడు పురాణములను పదునెనిమిది గా వివరించి చెప్పెను. వీటికి సంభందించి ఒక శ్లోకమును వ్యాసమహర్షి ఈ విధంగా చెప్పెను.
"మద్వయం భద్వయం చైవ బ్రత్రయమ్ వచ తుష్వయమ్ అనాపద్లింగ కూస్కాని పురాణాని పృథక్ పృథక్ " అని పద్దెనిమిది పురాణముల గూర్చి సంస్కృత భాషలో విపులీకరించెను. ఇంతేకాక మహాభారతమును కూడా ఇతిహాసములలోకి వచ్చునదిగా చెప్పి -
" ధర్మే చార్దే చ కామేచ మొక్షేచ భరత ర్ష భ
యది హస్తి తదన్యత్ర మన్నేహస్తిన తత్ క్వచిత్ "
అనే శ్లోక భావం ' ధర్మాత్త్వజ్ఞులు ధర్మశాస్త్రంబని ' అనే విధమైనదిగా మహాభారతాన్ని వ్యాసభగవానుడు ప్రస్తుతించినాడు
'వేదాన్విభజ్య సూత్రాణి పురాణాని విరచ్యతే
ధర్మాత్రి పథగాం పృత్వ్యాం చాలయంతం మునిం నుమః '
వేదాలను విభజించి, బ్రహ్మ సూత్రాలను నిర్మించి, అష్టాదశ పురాణాలను వ్రాసి ఈ మూడు రీతుల ధర్మ గంగానదిని ప్రవహింపజేస్తున్న వ్యాసుల వారిని స్తుతిస్తున్నాను.
శ్రీ వ్యాసులవారు పురాణములను ప్రజలయోక్క శాంతి సౌఖ్యాలను దృష్టిలో ఉంచుకొని, వారి పాపకర్మల నివారణార్ధం భాగావంటును కథలు, గాధలు పురాణముల ద్వారా ప్రజల కందించెను. మహాభారతం మొదలగు ఇతిహాసముల ద్వారా జనులకు ధర్మమును, నీతిని భోధించెను.
పరాంశర స్మృతి : కృతయుగమున తపస్సే ధర్మము. త్రేతాయుగమున జ్ఞానమే ధర్మము. ద్వాపర యుగమున యజ్ఞమే ధర్మము. కలియుగమున దానమే ధర్మము. (భవిష్య పురాణము).
బ్రహ్మవైవర్త పురాణమందు శ్రీకృష్ణ ద్వైపాయనుడు ఈ విధంగా కీర్తించబడినాడు: నాలుగు ముఖములు లేని బ్రహ్మ, రెండు చేతులే ఉన్న విష్ణువు, ఫాలలోచనం లేని శివుడు ఇది పదవ పురాణం
మత్స్య పురాణంలో చెప్పిన దానిని బట్టి పురాణాలు, సాత్త్విక, రాజస, తామసముల భేదం చేత మూడు విధాలు. సాత్త్వికములలో విష్ణు, మహత్యమును, రాజసాలలో బ్రహ్మగ్నుల మహత్యము, తామసాలలో శివ మహత్యము అధికంగా వర్ణింపబడినవి. వీటిలో బ్రహ్మ వైవర్త పురాణం జ్ఞాన వాజ్మయం వలె పురాణ వాజ్మయం కూడా అతి విస్తృత మైనది, అతి ప్రాచీన మైనది. వేదాలను విభజించినట్లే పురాణ వాజ్మయానికి కూడా ఒక నిశ్చిత రూపం ఇచ్చినవాడు వ్యాసుడే. ఈనాడు పద్దెనిమిది మహాపురాణాలు, పద్దెనిమిది ఉప పురాణాలు, ఇంకా పురాణాలనే పేరుతో మరికొన్ని గ్రంథాలు లభిస్తున్నాయి. పురాణం అనే ప్రతి ఒక్క గ్రంథానికీ, రచయితా వ్యాసుడే అని కొంతమంది విశ్వాసం. పురాణాలన్నీ వ్యాసకర్త్రు కాలనడం కంటే వ్యాస ప్రభావితాలనడం సమంజసంగా ఉంటుంది. అతి విస్తృతంగా ఉన్న పురాణ వాజ్మయానికి రూపురేఖలు దిద్ది వ్యాసుడు శిష్యునకు అందించగా ఆ పద్ధతినే అనుసరించి అనేక పురాణాలు వివిధకాలాల్లో ఆవిర్భవించాయి అని చెప్పడము ప్రాచీన గ్రంథ సమ్మతం కూడా. పురాణాల స్వరూప స్వభావాలను గూర్చి పురాణాలలోనే అక్కడక్కడ చెప్పబడియున్నది. ప్రాచీన వాజ్మయంలో మనకు పురాణము, పురాణ సంహిత అనే రెండు మాటలు వినిపిస్తాయి. పురాణ మనగా లోక వృత్తము. అది ఒక నిశ్చిత గ్రంథ రూపంలో కాకుండా ఒక కథాకథన రూపంలో, లోకంలో ప్రచారంలో ఉన్న విద్యావిశేషము. వీటిలో పురాణం అనేది వేదాల కంటే కూడా ప్రాచీనమైనదని కొన్ని పురాణాలు చెబుతున్నాయి. బ్రహ్మ నోటినుండి శతకోటి విస్తృతమైన (నూరుకోట్ల శ్లోకాల) పురాణం ముందు బయలు దేరినదట. పిమ్మట వేదాలు బయలు దేరినవట.
అతి ప్రాచీన కాలం నుంచీ రెండు వాజ్మయ ప్రవాహాలు బ్రహ్మనుంచి ఆవిర్భవించి పరస్పర ఉపకారాలుగా ఉంటూ రెండు మార్గాలలో ప్రవహిస్తున్నాయి.మొదటిది వేదవాజ్మయం. రెండవది పురాణ వాజ్మయ ప్రవాహం. మొదటి దానిని బ్రహ్మనుండి ఋషులు గ్రహించి ప్రచారం చేయగా రెండవ దానిని మునులు స్వీకరించి ప్రచారం చేసారు. అందుచేత ఈ రెండూ సమాన ప్రామాణ్యం కలవి.
బ్రహ్మ పురాణం - బ్రహ్మదేవుడు మరీచికి బోధించినది. 10,000 శ్లోకములు కలది.
పద్మ పురాణము - బ్రహ్మదేవునిచే చెప్పబడినది. 55,000 శ్లోకములు కలది.
విష్ణు పురాణం - పరాశరుని రచన. దీనిలో 63,000 (8,000?) శ్లోకములు ఉన్నాయి.
శివ పురాణం - వాయుదేవునిచే చెప్పబడినది. ఇందులో 24,000 శ్లోకాలున్నాయి.
లింగ పురాణము - నందీశ్వరుని రచన. 11,000 శ్లోకాలు ఉన్నది.
గరుడ పురాణం - విష్ణుమూర్తి గరుత్మంతునికి చెప్పిన ఈ పురాణంలో 19,000 (16,000?) శ్లోకాలున్నాయి.
నారద పురాణము - నారద మహర్షి రచన. 24,000 (25,000?) శ్లోకములు కలది.
భాగవత పురాణం- శుకమహర్షి పరీక్షిత్తునకుపదేశించినది. 18,000 శ్లోకములు కలది.
అగ్ని పురాణం - భృగుమహర్షిచే చెప్పబడినది. 16,000 (8,000?) శ్లోకములు కలది.
స్కంద పురాణం - కుమారస్వామిచే చెప్పబడినది. 80,000 (లక్ష?) ఇందు శ్లోకములు ఉన్నాయి.
భవిష్య పురాణం లేదా భవిష్యోత్తర పురాణం - శతానీకుడు సుమంతునకు బోధించినది. 14,500 (31,000?) శ్లోకములు ఉన్నాయి.
బ్రహ్మవైవర్త పురాణం - వశిష్ట మహర్షి అంబరీషునకు ఉపదేశించినది. 18,000 (12,000) శ్లోకములు కలది.
మార్కండేయ పురాణం - పక్షులు క్రోష్టి(జైమిని)కి చెప్పినట్లుగా మార్కండేయమహర్షి రచించెను. 9,000 (32,000?) శ్లోకములు ఉన్నది.
వామన పురాణము - బ్రహ్మదేవుని రచన - 14,000 శ్లోకములు కలది.
వరాహ పురాణం - శ్రీవరాహమూర్తి భూదేవికి ఉపదేశించినది. ఇందు 24,000 శ్లోకములు ఉన్నాయి.
మత్స్య పురాణం - శ్రీమత్స్యావతారుడైన విష్ణువు మనువునకు ఉపదేశించెను. దీనిలో 14,000 శ్లోకాలున్నాయి.
కూర్మ పురాణం - శ్రీకూర్మావతారుడైన విష్ణువు ఉపదేశించెను. దీనిలో 17,000 (6,000) శ్లోకాలున్నాయి.
బ్రహ్మాండ పురాణం - బ్రహ్మదేవుని రచన- 1,100 (12,200?) శ్లోకములున్నది.
బ్రహ్మవైవర్త పురాణం సావర్ణుడు నారదునికి ఉపదేశించాడు
ReplyDelete