కాలస్వరూపం - వర్ణనము-శ్రీ విష్ణు పురాణము
జగత్ సర్వం నారాయణ స్వరూపమే కనుక - ఎన్నో సృష్టిస్థితిలయాలు ఇలాగే గడిచిపోయాయి. అది తర్కానికి లొంగనిది మైత్రేయా! అచింత్యమైన జ్ఞానానికి మాత్రమే గోచరమవుతుంది. అది ఒక నిరంకుశ భగవద్విభూతి. ఊహించశక్యం కానిది.
తపస్విశ్రేష్ఠా! భగవానుడు ఈ సృజనలో ఏ విధంగ వ్రవర్తించేదీ మనం తెలియగలమా? బ్రహ్మ అతడే! లోక పితామహుడు అతడే! స్వయంభువు. లోకంలోని జీవుల పుట్టుకతో నారాయణుని పోల్చగలమా?
అటువంటి స్వయంభువు యొక్క పరమాయుర్దాయమే - బ్రహ్మమానం ప్రకారం వందసంవత్సరాలు. దీనికే 'పరాయువు' అని పేరు. ఇందులో సగం - అంటే పరార్థం!....మొదటి యాభై ఏళ్లను పూర్వపరార్థం అనీ, రెండో సగాన్ని ద్వితీయపరార్థం అనీ వ్యవహరిస్తారు. 'బ్రహ్మ' గా సృష్టికర్తగా శ్రీమహావిష్ణువు యొక్క జీవన కాలప్రమాణం - దేవతలకాలమానం ప్రకారం - ఇలా వర్గీకరించవచ్చు! దీనిని ఇక్కడే ఇవ్వబడిన మానవకాలమానంతో పోల్చి చూసుకోవచ్చు!
మానుష కాలమానం
15 నిమేషములు ఒక కాష్ఠ. 30కాష్ఠలు 1 కల. 30 కలలు 1 ముహూర్తము. 30 ముహూర్తములు 1 దినము (ఒక పగలు - ఒక రాత్రి). 30 దినములు ఒక మాసము. 15 దినములు ఒక పక్షము (శుక్లపక్షము - కృష్ణపక్షము). 2 పక్షములు ఒక మాసము. 6 మాసములు ఒక అయనము. 2 అయనములు (ఉత్తర - దక్షిణాయనములు) 1 సంవత్సరము. ఉత్తరాయణము 6 మాసములు దేవతలకొక పగలు, పితృదేవతలకు రాత్రి. దక్షిణాయనము 6 మాసములు దేవతలకు రాత్రి, పితృదేవతలకు పగలు. దేవతల వేయి సంవత్సరములు (దివ్య) ఒక మహాయుగము. నాలుగు వేల దివ్య సంవత్సరములంటే...మనకాలమానం ప్రకారం కొన్ని కొన్ని లక్షల సం||
దేవతల కాలమానం ప్రకారం
యుగములు యగసంధ్య యుగ సంధ్యాంశము
కృత యుగము 4 వేల దివ్య సంవత్సరములు 4 వందల దివ్య సంవత్సరములు 4 వందల సంవత్సరములు
త్రేతా యుగము 3 వేల దివ్య సమ్వత్సరములు 3 వందల దివ్య సంవత్సరములు 3 వందల సంవత్సరములు
ద్వాపర యుగము 2 వేల దివ్య సంవత్సరములు 2 వందల దివ్య సంవత్స్రములు 2 వందల సంవత్సరములు
కలియుగము 1 వేయి దివ్య సంవత్సరములు 1 వంద దివ్య సంవత్సరములు 1 వంద సంవత్సరములు
ఈ దేవతల కాలమానం ప్రకారంగా, మనం కాలాన్ని మనలెక్కల్లో వేసి చూస్తే - కృతయుగానికి 17 లక్షల 28 వేల మానుషసంవత్సరములు. త్రేతాయుగం 12 లక్షల 96 వేల ఏళ్లు. ద్వాపరయుగం 8 లక్షల 24 వేల సంవత్సరములు. కలియుగానికి ఈ లెక్కల ప్రకారం 4 లక్షల 32 వేల సంవత్సరములు.
ఇటువంటి యుగాలు వెయ్యి గడవాలంటే, 432 కోట్ల సంవత్సరాల కాలం పడుతుంది. ఇది బ్రహ్మకు కేవలం పగలు మాత్రమే! మరో 432 కోట్ల సంవత్సరాల కాలం రాత్రి అన్నమాట! పరమపురుషుడు - జగత్కారకుడు అయిన ఈ పితామహునికి సృష్టి సమయం - పగలు. రాత్రి అతడు నిద్రించేవేళ ప్రళయం. ఇన్ని కోట్ల సంవత్సరాల మొత్తం కాలపరిమితికి 'నైమిత్తిక కల్పం' అని పేరు.
ఇక - ఇలాంటి ముప్పైరోజులు విధాతకు ఒక నెల. ఇట్టివి 12 గడిస్తేనే ఒక 'సమ'. ఇలాంటి సమలు ఒక వంద గడిస్తే అదీ బ్రహ్మగారి అసలు ఆయువు. వీటిని అలా గుణించుకుంటూ పోతే, మన సంఖ్యామానంలో చివర్నచేరే సున్నలసంఖ్య అనంతం. వాటిని ఉచ్చరించగల పేర్లే మనకు లేవు. కనుక లెక్కకు అతీతమైనది ఈ బ్రహ్మాయుర్దాయం.
ఈ బ్రహ్మాయువుకే 'మహాకల్పం' అని పేరు. ఇది పూర్వకాల్పంలో ఎన్ని సంవత్సరాలో, ఉత్తర (ద్వితీయ పర) కల్పంలోనూ అన్ని సంవత్సరాలు. పూర్వకల్పానికి పద్మకల్పం అనీ, ద్వితీయపరానికి వరాహకల్పం అనీ పేర్లు. మనం ఇప్పుడు ద్వితీయ పరం వరాహకల్పంలో ఉన్నాం! ఇందులోనూ కలియుగంలో ఉన్నాం! (ఏదైనా దైవకార్యం తల పెట్టినప్పుడు మనం చెప్పుకొనే సంకల్పంలో 'ద్వితీయపరా' ర్థే - శ్వేత 'వరాహకల్పే' అని చెప్పుకోవడం విదితమే కదా!) దీనికి శ్లోకం ప్రమాణం :
ఏవంచబ్రహ్మణోవర్షమేవం వష శతంతుతత్ |
శతంహితస్యవషాణాం పరమాయుర్మహాత్మనః ||
ఏకమస్యాప్యతీతంతు పరాదం బ్రహ్మణో నఘ |
తస్యాంతే భూన్మహాకల్పః ప్రాద్మ ఇత్యభివిశ్రుతః
ద్వితీయస్యపరాధ స్యవత మానస్యవై ద్విజ |
వారాహఇతికల్పో యంప్రథమఃపరికీతితః ||
బ్రహ్మపగటివేళ చేసే సృష్టికాలం మొత్తం మీద పధ్నాలుగుమంది మనువులు, ఆయా మన్వంతరాలకు మూలభూతులవుతారు. సప్తర్షులు, దేవతలు, ఇంద్రాదులు, మనువు - వారి పుత్రులు ఈ కాలంలోనే క్రమంగా సృజించబడి - ప్రళయ వేళ ఉపసంహరణ కావించబడతారు. 71 చతుర్యుగాలు కలిపితే (దేవతల మహాయుగం) ఒక మన్వంతరం అవుతుంది.
బ్రహ్మాయుర్దాయకాలంలో 14 మంది మనువులు జనించడం, వెళ్ళిపోవడం కూడ జరిగాక, నైమిత్తిక ప్రళయం ఏర్పడుతుంది. దీనినే ప్రతి సంచరం అన్నారు.
అప్పటిస్థితి ఎలా ఉంటుందంటే...
ముల్లోకాలూ తగలబడిపోతాయి. గొప్పవేడిమి బయల్వెడలి, ప్రజలా వేడిని భరించలేక యమలోకగతులౌతారు. అంతా జలమయం అయిపోగా ఎటుచూసినా సముద్రమే కనిపిస్తుంది. అప్పుడు విథాత, నారాయణ స్వరూపుడై లోకాలు మూడింటినీ తనలో దాచుకొని, శేషతల్పం మీద శయనిస్తాడు.
ఆ సమయంలో - సృష్టికర్త పదవిని అంతవరకు నిర్వహించిన బ్రహ్మ కూడా విష్ణుదేవుని (అనగా - ఇక్కడ విరాట్ స్వరూపుని) నాభికమలంలో నిద్రిస్తాడు. ఆ సమయంలో జనలోకంలో ఉండే యోగులు, మునీశ్వరులు పరమాత్మ ధ్యానమగ్ను లౌతారు.
ఎంత పగటికాలం గడిచిందో అంతే ప్రమాణకాలపు రాత్రి కూడా గడిచాక తిరిగి సృష్టి మొదలవుతుంది. ఇదొక నిరంతరాయ ప్రక్రియ.

No comments:
Post a Comment