శ్రీ అన్నమాచార్య కీర్తనలు

     

     

       

కీర్తన :1 

కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ|
తెట్టలాయ మహిమలే తిరుమల కొండ ||

వేదములే శిలలై వెలసినది కొండ
యేదెస బుణ్యరాసులేయేరులైనది
కొండకాదిలి బ్రహ్మాదిలోకములకొనల కొండ
శ్రీదేవుదుండేటి శేషాద్రి కొండ ||

సర్వదేవతలు మృగజాతులై చరించేకొండ
నిర్వహించి జలధులే నిట్టచరులైన కొండ
వుర్విదపసులే తరువులై నిలచిన కొండ
పూర్వటంజనాద్రి యీ పొడవాటి కొండ ||

వరములు కొటారుగా వక్కాణించి పెంచేకొండ
పరుగు లక్ష్మీకాంతుసోబనపు గొండ
కురిసి సంపదలెల్ల గుహల నిండిన కొండ
విరివైన దదివో శ్రీవేంకటపు గొండ ||



కీర్తన :2

చాలదా హరినామ సౌఖ్యామృతము తమకు చాలదా హితవైన చవులెల్లను నొసగ ||

ఇది యొకటి హరి నామ మింతైన జాలదా చెదరకీ జన్మముల చెరలు విడిపించ
మదినొకటె హరినామ మింతైన జాలదా పదివేల నరక కూపముల వెడలించ ||

కలదొకటి హరినామ కనకాద్రి చాలదా తొలగుమని దారిద్ర్యదోషంబు చెఱచ
తెలివొకటి హరినామదీప మది చాలదా కలుషంపు కఠిన చీకటి పారద్రోల ||

తగువేంకటేశు కీర్తనమొకటి చాలదా జగములో కల్ప భూజంబు వలెనుండ

సొగసి యీవిభుని దాసుల కరుణ చాలదా నగవు జూపులను నున్నతమెపుడు జూప ||




కీర్తన :3

 ఏమని పొగదుడుమే యికనిను | ఆమని సొబగుల అలమేల్మంగ ||

 తెలికన్నుల నీ తేటలే కదవే | వెలయగ విభునికి వెన్నెలలు |
పులకల మొలకల పొదులివి గదవే | పలుమరు పువ్వుల పానుపులు ||

తియ్యపు నీమోవి తేనెలే కదవే | వియ్యపు రమణుని విందులివి |
ముయ్యక మూసిన మొలక నవ్వు గదె | నెయ్యపు గప్పురపు నెరి బాగాలు ||

కైవసమగు నీ కౌగిలే కదవే | శ్రీ వేంకటేశ్వరు సిరి నగరు |

తావు కొన్న మీ తమకములే కదే | కావించిన మీ కల్యాణములు ||




కీర్తన :4

ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన, అంతమాత్రమే నీవు |
అంతరాంతరములెంచి చూడ, పిండంతేనిప్పటి అన్నట్లు ||

కొలుతురు మిము వైష్ణవులు, కూరిమితో విష్ణుడని
పలుకుదురు మిము వేదాంతులు, పరబ్రహ్మంబనుచు
తలతురు మిము శైవులు, తగిన భక్తులునూ శివుడనుచు
అలరి పొగడుదురు కాపాలికులు, ఆది భైరవుడనుచు ||

సరి మిమ్ముదురు సాక్తేయులు, శక్తి రూపు నీవనుచు
దరిశనములు మిము నానా విధులను, తలుపుల కొలదుల భజింతురు
సిరుల మిమునే అల్పబుద్ది, తలచినవారికి అల్పంబగుదవు
దరిమల మిమునే ఘనమని తలచిన, ఘనబుద్ధులకు ఘనుడవు ||

నీవలన కొరతే లేదు మరి నీరు కొలది తామరవు
ఆవల భాగీరధి దరి బావుల ఆ జలమే ఊరినయట్లు
శ్రీ వేంకటపతి నీవైతే మము చేకొని వున్న దైవ(ము)మని

ఈవలనే నీ శరణనిఎదను, ఇదియే పరతత్వము నాకు ||





కీర్తన :5

వినరో భాగ్యము విష్ణుకథ - వెనుబలమిదివో విష్ణు కథ||

ఆదినుండి సంధ్యాదివిధులలోవేదంబయినది విష్ణుకథ
నాదించీనిదె నారదాదులచేవీదివీధులనే విష్ణుకథ ||

వదలక వేదవ్యాసులు నుడిగినవిదితపావనము విష్ణుకథ
సదనంబైనది సంకీర్థనయైవెదకినచోటనే విష్ణుకథ. ||

గొల్లెతలు చల్ల గొనకొని చిలుకగవెల్లవిరియాయ విష్ణుకథ
యిల్లిదె శ్రీ వేంకటేశ్వరునామమువెల్లిగొలిపె నీవిష్ణుకథ. ||







1 comment: